పసివాడి ప్రాణం... ఏం పాపం చేశాడనీ...?

September 04, 2015 | 11:56 AM | 15 Views
ప్రింట్ కామెంట్
three-year-old-drowned-Syrian-Boy-Aylan-Kurdisyrian.jpg

ఉగ్ర దాడుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ, కడలి ఆ కుటుంబాన్ని కాటేసింది.  ముక్కు పచ్చలారని మూడేళ్ల పసిబాలుడి అయిలాన్ మృతదేహం సముద్ర తీరంలోకి కొట్టుకొచ్చిన హృదయ విదార ఘటన. సముద్ర తీరంలో పడి ఉన్న బాలుడి మృత దేహం చిత్రాలు సోషల్ మీడియాలో నిన్న చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్కరినీ కదిలించివేసిందీ చిత్రం. అసలు ఆ చిన్నారి చేసిన పాపమేంటీ? రాక్షసుల బారి నుంచి పారిపోవటమేనా? ప్రాణాలతో బయటపడిన ఆ బాలుడి తండ్రి అబ్దుల్లా మీడియా ముందుకొచ్చి ఆ రోజు జరిగిన అసలు విషయం చెప్పసాగాడు.

                                      సిరియాలో ఐఎస్ ఉగ్రరాక్షసుల దాడుల నుంచి తప్పించుకునేందుకు గ్రీస్ లోని బంధువుల దగ్గరికి చేరుకోని, అక్కడ నుంచి కెనడా వెళ్దామని ప్రయత్నించాం. దానికి సముద్ర మార్గం ఒక్కటే ఆప్షన్. దీంతో కొందరు స్మగ్లర్లను సంప్రదించి ఓ మోటరు బోటును తీసుకున్నాడు. కానీ వారు మోసం చేసి కేవలం రబ్బరు పడవను మాత్రమే ఇచ్చారు. అబ్దుల్లా తోపాటు మరో కుటుంబాలు ఆ చిన్న పడవ ఎక్కి ప్రయాణం ఆరంభించాయి. కానీ, విధి వక్ర దృష్టితో చూసింది. మార్గమధ్యలో అలల దాటికి బోటు తిరగబడింది. ఇద్దరు చిన్నారులు అయిలాన్, గాలిబ్ లు నీటిలో పడిపోయారు. అయిలాన్ ను భార్య రెహాన్ కు అప్పజెప్పి తాను మరో కుమారుడిని పట్టుకుని ఈదాడు. భార్యతో అయిలాన్ తల గాలిలోనే ఉండేలా చూడమని సూచించాడట. కానీ, దురదృష్టవశాత్తూ  అబ్దుల్లా తప్ప ఎవరూ బతకలేదు. అమాయక ప్రజలపై దాడులు చెయ్యటం కారణంగా నెలన్నరలో దాదాపు 700 మంది శరణార్థులు సిరియా నుంచి పారిపోతున్నారట.  చిన్నపిల్లలు, మహిళలు, ఆఖరికి గర్భవతులు అని కూడా చూడకుండా కిరాతకంగా చంపుతున్నారు. ప్రత్యక్షంగానే ఇలా పరోక్షంగా కూడా ప్రజల మరణాలకు కారణమౌతున్నారు. ఐఎస్ నుంచి పారిపోయేందుకు స్మగర్లను ఆశ్రయించటం, వారు నిలువు దొపిడీ చెయ్యటం అక్కడ ప్రజలకు పరిపాటు అయిపోయింది. తన వారి మృత దేహాల వద్ద బోరున విలపిస్తున్న అబ్దుల్లా ను చూసైనా, ఆ మూడేళ్ల బాలుడి మృత దేహాన్ని చూసైనా ఐఎస్ మారితే బాగుండనిపిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ