బ్లూఫిల్మ్స్ చూసిన భర్తను బామ్మ ఏం చేసిందంటే...

April 21, 2016 | 05:20 PM | 5 Views
ప్రింట్ కామెంట్
old-man-killed-by-wife-watching-porn-niharonline

వారిద్దరికి వివాహం అయ్యి 50 ఏళ్లు గడుస్తుంది, పైగా 15 ఏళ్ల వయసులోనే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే... గత పదేళ్లుగా ఒక్కసారంటే ఒక్కసారి కూడా అతగాడు ఆమెను తాకలేదంట. పైగా రాత్రి పగలు తేడా లేకుండా పోర్న్ వీడియోలు చూస్తూనే ఉన్నాడంట. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ వృద్ధ నారీమణి ఆగ్రహంతో తన వృద్ధ భర్తను హత్య చేసింది. వివరాల్లోకి వెళ్లితే... లాంక్ షైర్ లోని ఓస్వాల్డ్ విజిల్ లో లిండా హోమ్స్(70), గోర్డాన్(78) అనే ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. ఒకరోజు ఆమె బయటకు వెళ్లి తిరిగి రాగా అతడు ఇంట్లో అశ్లీల చిత్రాలు చూస్తూ కనిపించాడు. ఆమె అడిగితే తాను చూడలేదని బుకాయించాడు. దీంతో కాలిన ఆ బామ్మ పక్కనున్న సుత్తెను తీసుకొని పదేపదే అతడి తలపై కొట్టడంతో చనిపోయాడు.

             'అతడు పోర్న్ వీడియోలు చూస్తుండగా పట్టుకున్నాను. కానీ, ఆ విషయం నుంచి పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించాడు. నాకు తీవ్ర కోపం వచ్చింది. చంపేయాలనుకున్నాను. తీవ్రంగా కొట్టాను. నేను చేసేది ఓ హత్యలాగా ఉండాలని భావించాను. గడిచిన పదేళ్లలో అతడు నన్ను ఒక్కసారి కూడా తాకలేదు. కానీ, పోర్న్ మాత్రం చూస్తున్నాడు. అతడికి ఎంత ధైర్యం. నా పదేళ్ల జీవితంలోకి నేను తిరిగి ఎలా వెళ్లగలను? అని ఆమె చెబుతోంది. మానసిక ఆందోళనకు లోనయ్యే తాను ఈ హత్య చేసినట్లు చెప్పింది. పదిహనేళ్ల వయసులో ఒకరినొకరు కలిసిన వీరిద్దరు ఐదేళ్లు గడిచిన తర్వాత భార్యాభర్తలుగా జీవితాన్ని ప్రారంభించారు. ప్రేమతో మొదలైన వీరి జీవితం చివర్లో ఇలా విషాదంగా మారుతుందని ఎవరు మాత్రం ఊహించి ఉంటారు చెప్పండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ