టాప్ లెస్ సెల్ఫీతో సస్పెండయ్యింది

April 20, 2016 | 10:56 AM | 4 Views
ప్రింట్ కామెంట్
mexican-lady-cop-topless-selfie-suspended-niharonline

ప్రస్తుత ట్రెండ్ లో సెల్ఫీ మోజుకు ఎవరూ అతీతం కావటం లేదు. ప్రపంచ దేశాల అధ్యక్షుల నుంచి సగటు మనిషి దాకా అందరూ దీనికి బానిసలవటం ఒక ఎత్తయితే, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆనందించడం మరో ఎత్తు. ఈ క్రమంలో క్రేజీగా సెల్ఫీ దిగుదామనుకుంది ఓ మహిళా పోలీసు అధికారి. పర్యవసనం ఇప్పుడు ఆమె ఉద్యోగానికే ఎసరు తెచ్చింది.

మెక్సికోలోని ఎస్కోబెడోలో పెట్రోలింగ్ చేస్తున్న కారులో నిదియా గార్సియా ఆనే మహిళ పోలీసు టాప్ లెస్ సెల్ఫీ తీసుకుంది. తన యూనిఫాం ను విప్పేసి వక్షోజాలను చూపిస్తూ సెల్ఫీ దిగింది. అంతటితో ఆవిడగారి వ్యవహారం అయిపోలేదు ఆ ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. అది కాస్త బాగా వైరల్ అయి ఆ నోట ఈ నోట ఉన్నతాధికారులకు చేరింది.

యూనిఫాంలో ఉండటమే కాకుండా ఆయుధాలను కూడా పక్కనే ఉంచి ఇలా చేసినందుకు అధికారులు అమెను సస్పెండ్ చేశారు. అంతే కాకుండా నిదియా సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఇతర సిబ్బంది కూడా పక్కనే ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తుకు ఆదేశించారు. అయితే తాను చేసిన పనికి పశ్చాత్తాపడుతున్నట్లు ఆవిడగారు తెలిపింది. తాను చేసిన పనికి అసహ్యించుకుంటున్నానని సోషల్ మీడియాలో క్షమాపణలు కోరింది. అన్నట్లు ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారండోయ్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ