అమెరికా ఆకాశంలో కాళిమాత దర్శనం

August 10, 2015 | 03:54 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Goddess_Kali_empire_state_building_NYC_niharonline

సృష్టి, స్థితి మరియు లయలకు కారణమైన కాళికా మాత శక్తిస్వరూపిణిగా మనదేశంలో ఆరాధిస్తాం. అలాంటి ఆమె విశ్వరూపం అమెరికాలో ప్రత్యక్షమైతే...? ఎలాగంటారా?ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై ఆమె రౌద్ర రూపాన్ని ప్రదర్శించారు. 102 అడుగుల ఆ ఆకాశ హర్శ్యంపై కాళికాదేవి చిత్రాన్ని ప్రొజెక్టు చేశారు.

                    న్యూయార్క్ లో గత బుధవారం రాత్రి ప్రొజెక్టర్ సాయంతో ఆ శక్తి స్వరూపిణ చిత్రాన్ని ఆకాశమంత ఎత్తున ఆవిష్కరించారు. ఆండ్రూ జోన్స్ అనే ఓ ఆర్టిస్ట్ దీనిని రూపొందించారు. కాగా, ఇప్పుడు ఆ చిత్రం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఆకాశ దేశంలో కాళికాదేవి ప్రత్యక్షమైందా అన్న భ్రాంతిని కలిగించేలా ఈ ప్రొజెక్షన్ ఉండటం విశేషం. కాలుష్యం, వినాశనం తదితరాలపై పోరాడేందుకు ప్రకృతికి ఓ భీకరమూర్తి అవసరం అన్న కోణంలో ఈ కాళికామాత కాన్సెప్ట్ ను రూపొందిచాడట. అంతకుముందు, ఇతగాడే అంతరించిపోతున్న జీవుల చిత్రాలను, మొన్నామధ్య అమెరికా డెంటిస్టు బాణాలకు ప్రాణాలు వదిలిన సింహం సెసిల్ ను కూడా ప్రదర్శించాడు.  

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ