ఆ ఐరాస ఉపగ్రహం అదృష్టం చేసుకుంది

August 07, 2015 | 04:20 PM | 2 Views
ప్రింట్ కామెంట్
UN_global_satellite_named_abdul_kalam_niharonline

దివంగత నేత కలాం ప్రఖ్యాతులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయన్నది ప్రత్యేకంగా ఎవరూ చెప్పనక్కర్లేదు. అందుకే ఆ మహానుభావుడి పుట్టిన రోజుని అంతర్జాతీయ విద్యార్థి దినంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఐరాస తీసుకున్న మరో నిర్ణయం ఆయన ఖ్యాతిని చెప్పకనే చెప్పింది. ఎర్త్ అబ్జర్వేషన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ప్రయోజనాల కోసం రూపొందించిన ఓ శాటిలైట్ కు కలాం పేరు పెడుతున్నట్లు ఆ ప్రాజెక్టు నిర్వాహకులు సీఏఎన్ఈయూఎస్ సంస్థ చైర్మన్ మిలింద్ పింప్రికర్ ప్రకటించారు.

విపత్తు తగ్గింపు కోసం ఉపయోగపడే సాంకేతిక పరిజ్నానాన్ని అందరితో పంచుకోవాలన్నదే ఐరాస ఉద్దేశమని. కలాం పేరు పెట్టడానికి ఓ కారణం ఉందని ఆయన చెప్పారు. అంతరిక్ష పరిశోధన రంగంలో ముందు వరుసలో ఉన్నదేశాలు చేతులు కలపాలని, మానవాళిని నష్టపరుస్తున్న విపత్తులను ఎదుర్కొనేందుకు తగిన మార్గాలను కనుగొనాలని ఆయన కలాం తన వరల్డ్ స్నేస్ విజన్ 2050 లో ఆకాంక్షించినట్లు పింప్రికర్ తెలిపారు. అందుకే ఆయన లక్ష్యాలను అనుగుణంగా ఉంది కాబట్టే, ఆ శాటిలైట్ కి కలాం పేరు పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ