అమెరికాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీ ఓ సంచలనమైన నిర్ణయాన్ని వెలువరించింది. ఇకపై ప్రొఫెసర్లు, ఉద్యోగులు ఎవరూ కూడా విద్యార్థులతో లైంగిక సంబంధాలు పెట్టుకోరాదని ఆదేశించిది. విద్యార్ధులతో రొమాన్స్, సెక్స్ సంబంధాలను నిషేధిస్తున్నాం అని వర్సిటీ యాజమాన్య కమిటీ తెలిపింది. గత కొంతకాలంగా వర్సిటీలో వేధింపుల ఫిర్యాదులు పెరుగుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అమెరికాలోని అత్యధికంగా ఫిర్యాదులు వచ్చిన వర్సిటీల జాబితాను తయారు చేసింది. అందులో ఎక్కువగా అండర్ గ్రాడ్యుయేట్స్, ఫ్యాకల్టీల మధ్య లైంగిక సంబంధాలు అధికంగా ఉన్నాయని అమెరికా ప్రభుత్వం తెలిపింది.