వామ్మో... భారత్ లోనూ ధనికులు దండీగా ఉన్నారే

February 05, 2015 | 02:25 PM | 48 Views
ప్రింట్ కామెంట్

దేశ జనాభా మాదిరిగానే భారత్ లో బిలియనీర్ల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుందండోయ్... ప్రపంచ కుబేరుల జాబితాను లెక్కేసినట్లైతే, 97 మంది బిలియనీర్లతో తృతియ స్థాన్నాన్ని అదిరోహించింది భారత్. బిలినీయర్ల సంఖ్య నానాటికి పెరుగుతున్నట్లు ప్రపంచ ఆర్థిక సంస్థల నివేదికలు, జాబితాలు తెలుపుతున్నాయి. ఇందులో భాగంగా చైనాకు చెందిన హూరూన్ మాగ్ జైన్ విడుదల చేసిన జాబితాలో భారత్ టాప్ 3 పొజిషన్ ను సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 2,089 బిలియనీర్లు ఉన్నట్లు హూరూన్ మాగ్ జైన్ తెలిపింది. ఇందులో 537 మంది కుబేరులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 430 మంది కుబేరులతో చైనా ద్వీతియ స్థానంలో ఉంది. అటు గతంలో మూడవ స్థానంలో రష్యాను వెనక్కినెట్టి భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. రష్యాలో 93 మంది కుబేరులే ఉన్నారని పేర్కొంది. భారత్ విషయానికొస్తే రూ. 1.2 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి రూ. 1.02 లక్షల కోట్లు మరియు టాటా సన్స్ రూ. 96 వేల కోట్లతో నిలిచారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ