ప్రపంచంలో చెత్త మొగుడు అంటే బహుశా వీడే కాబోలు. ఏ భర్త భార్యతో చేయించని పనులను చేయించాడా రాక్షసుడు. డబ్బు కోసం భార్యను వ్యభిచారంలోకి దించాడు. నాలుగైదు బూతు సైట్లలో భార్య నగ్న చిత్రాలను ఉంచి బిజినెస్ ప్రారంభించాడు. పరాయి వ్యక్తులతో పడుకోవాలని భార్యను చిత్రహింసలు పెట్టాడు. నాలుగేళ్లలో 2.700 మంది దగ్గరికి భార్యను పంపాడు.
ఫ్రాన్స్ కి చెందిన ఈ 54 ఏళ్ల ఆ మృగం 46 ఏళ్ల తన భార్యతో గత నాలుగేళ్లుగా ఇదే పనికానిస్తున్నాడు. రోజుకు కనీసం ముగ్గురి నుంచి నలుగురి వ్యక్తుల దగ్గరికి భార్యను పంపించేవాడట. ఒకవేళ కస్టమర్లకు కుదరకపోతే తన ఇంటికే రమ్మని ఆహ్వానించేవాడట. ఇక ఇంటికి వచ్చాక తన ఐదేళ్ల కొడుకుని తీసుకుని పనయ్యేదాకా బయట కస్టమర్ల కార్లో షికారులు కొట్టేవాడట. భార్య ఎదురు తిరగినప్పుడల్లా ఆమెను గొడ్డును బాదినట్లు బాదేవాడని హింసను తట్టుకోలేక చనిపోదామనుకున్న కొడుకు కోసం బతికున్నానని ఆమె రొదిస్తూ చెబుతోంది. ఇలా ఇన్ని సంవత్సరాలలో అలా భార్యతో బిజినెస్ చేయించి 1,76,000 డాలర్లు (కోటి రూపాయలు పైనే) సంపాదించాడట.
నిజానికి ఫ్రాన్స్ లో వ్యభిచారంకు అనుమతి ఉంది. కానీ, ఇలా చిత్రహింసలతో చేయించటం మాత్రం నేరమని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆ రాక్షసుడికి పెద్ద శిక్షే పడే అవకాశం ఉంది.