వామ్మో! పాక్ మరింత డేంజర్ గా మారుతుందా?

November 09, 2015 | 12:58 PM | 2 Views
ప్రింట్ కామెంట్
newyork-times-pak-nuclear-most-dangerous-third-power-niharonline

దాయాది పాకిస్థాన్ భారత్ కే కాదు, ప్రపంచ దేశాలకు ప్రమాదకరంగా మారబోతుందా? అవుననే అంటున్నాయి నిఘావర్గాలు. అత్యధిక అణ్వాయుధాలు నిల్వ చేసుకున్న రానున్న 10 సంవత్సరాలలో టాప్-3 దేశంగా పాకిస్థాన్ నిలవబోతుందట. దీంతో ప్రపంచ దేశాలన్నింటికీ పాకిస్థాన్ ముచ్చెమటలు పోయించే ప్రమాదం ఉందని నిపుణులు వారిస్తున్నారు. ఇప్పటికే 120 వార్ హెడ్స్ ఆ దేశంలో ఉన్నాయని, 2025 నాటికి అణ్వాయుధాల విషయంలో చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ లను పాకిస్థాన్ అధిగమించనుందని తెలుస్తోంది.

'న్యూయార్క్ టైమ్స్' తన సంపాదకీయంలో ఈ విషయమై కూలంకశంగా వివరించింది. ఇండియాలోని అన్ని ప్రాంతాలను, అంతకు మించిన సుదూర లక్ష్యాలను పాక్ అణ్వాయుధాలు చేరుకునేలా ఉంటాయని, ఈ విషయం ప్రపంచానికి ఓ పీడకలేనని అభిప్రాయపడింది. తీవ్రవాదులు అధికంగా ఉన్న పాకిస్థాన్ లో అణ్వాయుధాలు తయారవ్వటం మరింత ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ దేశాలు ఓవైపు నుంచి ఒత్తిడి చేస్తుంటే, మరోవైపు పాక్ మాత్రం అణు వ్యవహారాల్లో ముందుకే వెళ్తుందని ఆరోపించింది.

1998లో ఇండియాలో అణ్వాయుధాలపై నిషేధం విధించారని, దాన్ని అనుకరిస్తూ పాకిస్థాన్ కూడా ఆంక్షలు విధించిందని అయితే అదంతా బయటి ప్రపంచాన్ని నమ్మించేందుకేనని తెలిపింది. ఆ తర్వాత మెల్లిగా ఆంక్షలను ఒక్కొటి తొలగించుకుంటూ వస్తున్న పాక్ భారీ స్థాయిలో అణ్వాయుధాలను తయారు చేస్తోందని పేర్కొంది. ఇంకోవైపు భద్రతా విషయాలపై పాక్ తో శాంతి ఒప్పందాల దిశగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క అడుగు కూడా వేయలేకపోయారని తెలిపింది. భారత్ తో సత్ససంబంధాలే పాక్ ను శాంతించేలా చెయ్యొచ్చునని అభిప్రాయపడింది. మరీ వార్తల నేపథ్యంలో మోదీ శాంతి ఒప్పందాల దిశగా అడుగులు వేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ