ఇంటితో బాటే బెడ్ రూం ఫ్రీ... ఓనరమ్మతో సహా!

March 11, 2015 | 05:23 PM | 65 Views
ప్రింట్ కామెంట్
house_for_sale_with_woman_in_indonesia_niharonline

ఈ మధ్య ఆన్ లైన్ ప్రకటనల పుణ్యమాని వస్తువుల క్రమవిక్రయాలు సులువతరం అయిపోతుంది. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా అది కొంటే ఇది ఫ్రీ ఇది కొంటే అది ఫ్రీ . చుడీ బజార్ లో గాజులు కొంటే చార్మినార్ ఫ్రీ, సాగర్ లో పడవెక్కితే బుద్ధ విగ్రహాం ఫ్రీ అంటూ ఫ్రీడం మూమెంట్ కు ఆజ్యం పోస్తుంటారు. ఇట్టి ఉద్యమ తరుణంలో ఓ తరుణిమణి ఇండోనేషియాలో తన స్వగ్రుహాన్ని అమ్మజూపిన ఉదంతం మగపురుషులందరికీ పగటికలలు తెప్పించి ఆరోగ్య భంగం కలిగిస్తోంది. వివరాల్లోకి వెళ్లితే విన్ లై అనే 40 ఏళ్ల వితంతువు జావా ద్వీపంలోని స్లెమస్ లో ఉన్న తన ఇంటిని అమ్మకానికి పెట్టింది. దాని ధర 999 మిలియన్ రూఫై(75,000)డాలర్లుగా నిర్ణయించింది. అంతేకాదు మీరు ఈ ఇల్లు కొనేప్పుడు మిమల్ని పెళ్లి చేసుకోవచ్చా అని ఆమెను అడగొచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు నిబంధనలు, షరతులు వర్తిస్తాయి అని పేర్కొంది. ఈ వార్త చాలా వేగంగా ఇండోనేషియా నెట్ వినియోగదారులకు పాకింది. ఈ విషయంపై ఇద్దరు పిల్లల తల్లి అయిన విన్ ను కదిలిస్తే... తన ప్రకటనపై వచ్చిన స్పందనకు షాక్ గురయ్యాయని, అదేసమయంలో తనను ఇంటర్వ్యూ చేసేందుకు జర్నలిస్టులు రావటంతో ఆనందించానని చెబుతోంది. కానీ, అది ఆమె ఆలోచన కాదట. తన ఇల్లు అమ్మాలనుకుని కొనేవారిని చూడమని ఓ స్నేహితుడికి పురమాయించానని, కొనే వ్యక్తి పెళ్లి కోసం ప్రయత్నించే వాడైతే బాగుంటుందని తనతో అన్నానని... అయితే తన స్నేహితుడు ఇలా నెట్ లో ప్రకటన రూపంలో పెడతాడని అనుకోలేదని ఆమె చెబుతోంది. ఇప్పటి దాకా ఒకే ఒక్క వ్యక్తి ప్రకటనకు స్పందించినట్లు ఆమె చెబుతోంది. అయితే అతడి వివరాలు వెల్లడించేందుకు ఆమె ఇష్టపడలేదు. ఇక ఈ ప్రకటన చూసిన ఓ వినియోగదారుడు విన్ చాలా స్మార్ట్... ఎందుకంటే ఇంటి యజమాని కూడా అమ్ముడుబోతే, ఆమే ఇంటికి ఓనర్ అవుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ