ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు మరో ఘాతుకానికి తెగబడ్డారు. ఓ లిబియా సైనికుడి పీక కోసి చంపారు. అయితే, ఆ చంపడం ఆషామాషీగా కాకుండా చిన్న పిల్లల ముందు కానిచ్చారు. అలా ఎందుకు చేశారు అన్న ప్రశ్నకు నిష్ఠూర పరిచే సమాధానమిచ్చారు. బాలల విద్యా సంబంధ ప్రయోజనాల నిమిత్తం ఈ కార్యక్రమం నిర్వహించారట. ఓ రకంగా జువాలజీ ప్రాక్టికల్స్ అన్నమాట. కప్పలు, బొద్దింకలను కొసినట్లు మనుషుల పీకలు కూడా ఎలా కోయాలో వారు చిన్నారులకు లైవ్ డెమో ఇచ్చారు. ఆ చిన్నారులు కూడా లిబియా సైనికుడి పీక కోసి తలను పట్టుకోవడాన్ని ఆసక్తిగా గమనించటం గమనార్హం. లిబియాలోని డెర్నాలో ఆ దారుణం చోటుచేసుకుంది. ఆ సమయంలో వారు స్కూలును ఆక్రమించి ఈ దారుణానికి పాల్పడ్డారట.