ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ అరాచకాలకు అంతులేకుండా పోతుంది. యాజిది మహిళలపై గ్యాంగ్ రేప్ లు చేసిన ఈ రాక్షసులు ఆ దారుణాలను సమర్థించుకున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామాను టార్గెట్ చేసింది. మిషెల్ ఒబామా ఓ వేశ్య అని అభివర్ణించింది. ఐఎస్ఐఎస్ కు చెందిన మ్యాగ్జైన్ దబీఖ్ లో ఇందుకు సంబంధించిన ఓ వ్యాసం ప్రచురించింది. అంతేకాదు ఆ ఆర్టికల్ కు స్లేవ్ గాళ్స్ ఆర్ ప్రాస్టిట్యూట్స్ అనే శీర్షికను కూడా పెట్టింది. మిషెల్ ఒబామా దినార్ లో మూడోవంతుకు మించిన విలువ చెయ్యదని, అసలు దినార్ లో మూడో వంతు కూడా ఎక్కువేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇక యాజిది యువతులను సెక్స్ బానిసలుగా చేసుకోవటాన్ని సమర్థించుకుంది.