బీఅలర్ట్ : కనిపించిందని క్లిక్ చేశారో బూతు బొమ్మలే

May 17, 2015 | 08:30 PM | 45 Views
ప్రింట్ కామెంట్
facebook_adult_porn_virus_niharonline.jpeg

ఫేస్ బుక్, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సామాజిక మాధ్యమాలలో ఒకటిది, ప్రముఖమైనది. అయితే ఇప్పుడు ఫేస్‌బుక్ యూజర్లను కొత్త వైరస్ ఇబ్బంది పెడుతోంది. ఈ వైరస్ ‌ సోకినపుడు ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే అన్ని బూతు బొమ్మలే కనిపిస్తాయి. ఈ వైరస్ గురించి నిపుణులు వివరిస్తూ.. ఫేస్ బుక్ అకౌంట్‌లో ప్రవేశించగానే వాల్‌పై న్యూడ్ ఫొటోలు దర్శనమిస్తాయి. పొరపాటుగా వాటిని క్లిక్ చేస్తే అభ్యంతరకర సీన్లు, చిత్రాలు ఓపెన్ అవుతాయి. ఒక సారి అవి ఓపెనయ్యాక వాటిని డిలీట్ చేయడం అసాధ్యమని తెలిపారు. దీన్నో స్పామర్ వైరస్ అని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. ఇది చైనా హ్యాకర్ల పనే అని అంటున్నారు. హ్యాకర్లు ఈ అశ్లీల చిత్రాలను మీ ఫేస్ బుక్ ఖాతాలోని ఓ 40 మందితో ట్యాగ్ చేస్తారని, ఆ ఫొటోలను క్లిక్ చేసినప్పుడు ఆ 40 మంది ఖాతాల్లోనూ వైరస్ ప్రవేశిస్తుందని వారు వివరించారు. ఈ వైరస్ ఇప్పటికే ఫేస్‌బుక్ ఖాతాదారుల్లో కలకలం రేపిందని అంటున్నారు. వైరస్ గురించి తెలియని పలువురు మిత్రుడని భావిస్తే ఇలాంటి ఫొటోలు పెట్టాడేంటని తిట్టిపోస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. ఇదంతా స్పామర్ వైరస్ మహిమేనని తేల్చేశారు. సో... బీకేర్ ఫుల్ .

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ