పాకిస్తాన్ లోని లాహోర్, ఇస్లామాబాద్ ఉత్తర పాకిస్థాన్ లతో పాటు కజకిస్తాన్ సరిహద్దులు ఆఫ్గనిస్తాన్ సరిహద్దులలో కొద్దిసేపటి క్రితం స్వల్ప భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ దెబ్బకు దేశ రాజధాని ఢిల్లీలో తోపాటు జమ్ముకాశ్మీర్ లోని శ్రీనగర్ లలో పలుచోట్ల ప్రకంపనలు రావడంతో జనం రోడ్ల మీదకు వచ్చారు. అయితే ఎక్కడా ప్రాణనష్టం కానీ ఆస్తినష్టం కానీ సంభవించిన విషయం తెలియరాలేదు. అంతేకాదు ఉత్తరాదిలో కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రాంతాలతో పాటు హిందూ ఖుష్ పర్వత శ్రేణులలో కూడా భూకంపం వచ్చింది. ఇది రిక్టర్ స్కేలు మీద 6.1 గా తీవ్రత నమోదయింది.
ఇటీవల నేపాల్ లో భూకంపం వచ్చి భారీ ఎత్తున ప్రాణ ఆస్తినష్టం సంబవించిన నేపథ్యంలో ఢిల్లీలో భూకంపం వార్తలు కలకలం రేపాయి. అయితే ఇది స్వల్ప ప్రకంపనలు మాత్రమే రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాకిస్తాన్ లో కూడా ప్రమాద నష్టం ఎంతనేది ఇంకా తెలియరాలేదు.