గత నెలలో జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ఏషియా విమాన ప్రమాద ఘటనలో మరణించిన వారి దేహాల అన్వేషణను నిలిపివేసినట్లు ఇండోనేషియా మిలిటరీ అధికారులు ప్రకటించారు. ప్రమాదంలో మొత్తం 162 మంది చనిపోగా, ఇప్పటివరకు కేవలం 70 శవాలను మాత్రమే వెలికితీశారు. వాతావరణం అనుకూలించకపోవటంతోపాటు, మ్రుతదేహాల కోసం అలుపెరుగకుండా అన్వేషణ చేయటంతో బ్రుందంలోని సభ్యులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సెర్చ్ ను నిలిపివేయాల్సిందిగా ఆదేశించామని వారు తెలిపారు. ఇంక మరో 92 దేహాలను వెలికితీయాల్సి ఉంది. ఇక వారంతా జల సమాధి అయినట్లేనని మలేషియా ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించనుంది.