నెట్ ప్రపంచంలోకి నయా బ్రౌజర్

January 28, 2015 | 11:36 AM | 28 Views
ప్రింట్ కామెంట్

ఇంటర్నెట్ రంగంలో మరో వెబ్ బ్రౌజర్ వచ్చి చేరింది. దీని పేరు వివాల్దీ. దీని రూపకర్త జాన్ వాన్ టెట్ష్ నర్. స్క్రీన్ పై ఓపెన్ టాబ్ ల విషయంలో సమస్యలు ఎదుర్కొనే వారికి వివాల్టీ పరిష్కారం చూపుతుందని టెట్ష్ నర్ చెబుతున్నాడు. విండోస్, మాక్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లపై ఇది పనిచేస్తుంది. మొబైల్, టాబ్లెట్ వర్షన్ అభివ్రుద్ధి దశలో ఉందని టెట్ష్ నర్ తెలిపాడు. వివాల్టీలో పర్సనల్ నోట్స్, బుక్ మార్క్స్, స్మాల్ స్ర్కీన్ షాట్స్, మల్టిపుల్ గ్రూప్స్, ఫోల్డర్లు వంటి ఫీచర్లున్నాయి. గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, ఆపిల్ సఫారీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ వంటి టాప్ బ్రౌజర్ల నడుమ తమ వివాల్డీకి కూడా చోటు ఉంటుందని విశ్వసిస్లున్నట్లు ఆయన తెలిపాడు. తమ బ్రౌజర్ తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందుతుందని టెట్ష్ నర్ ధీమా వ్యక్తేంచేస్తున్నాడు. గతంలో ఈయన ఓపెరా కు సీఈవోగా పనిచేశాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ