మరో ఇండోనేషియా విమానానికి ప్రమాదం

August 17, 2015 | 12:07 PM | 2 Views
ప్రింట్ కామెంట్
indonesia_triga_flight_debris_found_niharonline

ఇండోనేసియాకు చెందిన ఓ విమానం 54 ప్రయాణికులతో ఆదివారం గల్లంతయిన విషయం తెలిసిందే. మొత్తం 49 మంది ప్రయాణికుల్లో 5 చిన్నారులు ఉన్నారు. మరో ఐదుగురు వైమానిక సిబ్బంది. ఇక ఈ విమాన శకలాలు సోమవారం ఉదయం సమీపంలోని ఓ పర్వత శ్రేణులపై గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ట్రైగానా ఎయిర్‌ ఏటిఆర్‌ 42 టర్బోప్రాప్‌ విమానం పపువా రాజధాని జయపురాలోని సెంటాని ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరింది. అర గంటకే అంటే అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30కి ర్యాడార్‌పైనుంచి అదృశ్యమైంది.  పపువా ప్రావిన్స్‌లో ఉండగా విమానానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన నుంచి ఎవరూ బతికి బయటపడలేరని అధికారులు చెబుతారు.  వాతావరణం అనుకూలంగా లేదనీ, మేఘాలతో కూడుకుని ఉందనీ రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి జెఏ బరాటా తెలియజేశారు. వాతావరణం తెరిపివ్వగానే సోమవారం సహాయ కార్యకలాపాలు చేపట్టారు.

               ట్రైగానా ఎయిర్‌ను 1991లో ప్రారంభించారు. ఇండోనేసియాలోని 40 ప్రాంతాలకు అది సర్వీసులను నడుపుతోంది. అది ప్రారంభమైనప్పటి నుంచి 14 తీవ్రమైన దుర్ఘటనలను చవిచూసింది. యూరోపియన్‌ ఎయిర్‌ స్పేస్‌లోకి ప్రవేశించకుండా ఈ విమానయాన సంస్థను బ్లాక్‌లిస్ట్ లో  చేర్చారు. గత డిసెంబర్‌లో ఇండోనేసియాలోని సురబయ నుంచి సింగపూర్‌ వెళుతున్న ఎయిర్‌ఏసియాకు చెందిన విమానం తుపాను కారణంగా జావా సముద్రంలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో 162 మంది చనిపోయారు. జూన్‌లో ఇండోనేసియా మిలిటరీ విమానం మేడాన్‌ నగరంలోని జనావాసాల మధ్య కూలిపోయింది. దానిలో 142 మంది చనిపోయారు. విమాన రక్షణ విషయంలో ఇండోనేసియాకు మంచి పేరు లేదు. ఇప్పుడు ఈ ప్రమాదంతో మరో సారి అది నిరూపితమైంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ