ఆ దేశంలో శ్మశానాల్లో ఫ్రీ వైఫై!

December 11, 2015 | 04:46 PM | 3 Views
ప్రింట్ కామెంట్
russian-cemeteries-will-have-free-WiFi-niharonline

టెక్నాలజీని ప్రజలకు చేరవేయాలన్న ఉద్దేశాలు మంచివే. కానీ, అందుకోసం ఓ మెట్టు మరీ ఎక్కి ఏకంగా స్మశానాల్లో వైఫైను ఏర్పాటు చేస్తుంది ఓ దేశం. అదే మరెవరో కాదు అమెరికా తర్వాత అన్నిరంగాల్లో అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న రష్యానే కావటం విశేషం. దేశంలోని పలు నగరాల్లో ఉన్న శ్మశాన వాటికల్లో ఉచిత వైఫై సేవలను  అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ సేవలను తొలుత వాగన్‌కోవ్‌, ట్రోయెకురొవ్‌, నొవొడెవిచీ శ్మశానవాటికల్లో వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నాయి.

అయితే, రాజధాని మాస్కోలో కాకుండా మిగతా నగరాల్లో ఈ ఉచిత వైఫై సేవలను అందించడానికి కారణాలు లేకపోలేదు. వాగన్‌కోవ్‌, ట్రోయెకురొవ్‌, నొవొడెవిచీ శ్మశానవాటికల్లోనే రష్యాకు చెందిన పలువురు ప్రముఖుల సమాధులు ఉన్నాయి. ఇక్కడికి సందర్శకులు తరచుగా వస్తుంటారని, సమాచారం సేకరిస్తుంటారని, దీంతో ఇవి మిని మ్యూజియంగా మారాయని మాస్కో శ్మశాన నిర్వహణ సంస్థ ప్రతినిధి లిల్యా ల్వొస్కాయా తెలిపారు. అందుకే ఈ శ్మశాన వాటికల వద్ద ముందుగా ఉచిత వై-ఫై సేవలందించేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు.

కాగా, రష్యా దిగ్గజాలైన ప్రముఖ రచయిత ఆంటన్ చెకొవ్‌, సోవియట్ నేత నికిత కృశ్చేవ్, మొదటి రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ వంటి ప్రముఖుల సమాధులు ఆ శ్మశాన వాటికల్లోనే ఉన్నాయి. వీటికి లభించే ఆదరణ ఆధారంగా భవిష్యత్తులో మరిన్నీ శ్మశానాలకు వీటిని విస్తరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ