రెండేళ్ల చిన్నారిపై రేప్, హత్య... 359 ఏళ్ల శిక్ష

August 22, 2015 | 03:44 PM | 2 Views
ప్రింట్ కామెంట్
court_imprisonment_to_convict_for_359_years_niharonline

కొన్ని కొన్ని నేరాల గురించి వింటున్నప్పడు మనం ఉంది అసలు సవ్య సమాజంలోనేనా అన్న అనుమానం కలగక మానదు. అలాంటి సమయంలో ఆ కిరాతకులను కండఖండాలుగా నరికి ముక్కలు చెయ్యాలని ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంటుంది. కానీ, చట్టాలను గౌరవించే ప్రపంచంలో మనం ఉన్నాం. అలాంటి సందర్భాల్లో చట్టాలు కూడా మన అభిప్రాయాలతో ఏకీభవిస్తాయి. దానికి తాజా ఉదంతమే ఉదాహరణ.

                               రెండు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేసి, బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం కఠిన కారాగార శిక్ష విధించింది. వెస్ట్ సౌత్ కెనడాలోని అలస్కా ప్రాంతానికి చెందిన జెర్రీ ఆక్టీవ్ (26) అనే యువకుడికి శుక్రవారం న్యాయస్థానం శిక్ష విధించింది. మౌంట్ ఫోర్ట్ ప్రాంతంలో నివాసం ఉంటున్నటుచ్ చీయా (71), ఆయన భార్య సోర్న్ స్రీప్ (73) అనే ఇద్దరు 2013 మే నెలలో హత్యకు గురైనారు. అదే సమయంలో వీరి ఇంటిలో ఉన్న మనుమరాలు (2) మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తు నివేదికను కోర్టు ముందు సమర్పించారు. నిందితుడు జెర్రీ నేరం చేసినట్లు న్యాయస్థానంలో రుజువు అయ్యింది. నిందితుడు బాలిక మీద లైంగిక దాడి చెయ్యడమే కాకుండ ఇంటిలో దోపిడీ చేశాడని వెలుగు చూసింది.

                  పూర్తి వివరాలు సేకరించిన న్యాయస్థానం నిందితుడు నేరం చేశాడని చెప్పింది. నిందితుడికి 359 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి పిలిప్ ఓల్యాండ్ తీర్పు చెప్పారని స్థానిక మీడియా వెల్లడించింది. గతంలో జెర్రీ అనేక మంది బాలికల మీద లైంగిక దాడి చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇలాంటి కిరాతకుడికి ఎంత శిక్ష వేసినా తక్కువే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ