దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, దివంగత నెల్సన్ మండేలా మనవడు ముబుసో మండేలా ఓ అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. పదిహేనేళ్ల ను బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై మండేలా మనువడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం ఆలస్యం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 7 న జోహన్నెస్ బర్గ్ లోని ఓ రెస్టారెంటులో బాలికపై అతను అత్యాచారం చేసినట్లుగా ఫిర్యాదు వచ్చింది. దీంతో శనివారం ముబుసోను అరెస్ట్ చేసినట్లు జోహన్నెస్ బర్గ్ లోని పోలీసులు మీడియాకి తెలిపారు. అలాంటి మహత్ముడి వారసుడిగా ఇంత నీచమైన పని చేశాడా అని దేశ వాసులు ప్రస్తుతం అతనిని తిట్టుకుంటున్నారంట. అయితే అవన్నీ ఆరోపణలని మండేలా కుటుంబ సభ్యులు కొట్టిపారేస్తున్నారు.