పడుచు ప్రేయసి ప్రేమతో పిచ్చెక్కిపోతున్నాడు

March 31, 2015 | 11:32 AM | 111 Views
ప్రింట్ కామెంట్
mick_jagger_melanie_hamrick_niharonline

ప్రేమ గుడ్డిది. దానికి కులం, గోత్రం, రంగు, రూపు, ఆస్తి, అంతస్తు, వయస్సు... ఎక్సెట్రా ఎక్సెట్రా మొదలైన వాటితో సంబంధం లేదని పీకల లోతు దాకా మునిగిపోయిన ప్రేమికులు చెబుతుంటారు. అలాగే ప్రస్తుతం ఓ సెలబ్రిటీ జంట వయసుతో అనే కేటగిరీని బాగా అన్వయించి చూపుతోంది. గతంలో రాక్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘రోలింగ్ స్టోన్ బ్యాండ్’ వ్యవస్థాపకుడు,  ప్రముఖ సింగర్ మిక్ జాగర్(71), ప్రముఖ వర్థమాన డాన్సర్ మెలాని హామ్రీ(27) మధ్య నెలకొన్న ప్రేమాయణం అమెరికాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఎక్కడికెళ్లిన పత్రికలు, చానెళ్లు వారివెంటనే పడుతున్నాయి. గతేడాది మార్చిలో మిక్ జాగర్ భార్య ఎల్ రెన్ స్కాట్ ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం ఈ ప్రేమాయణం అనే గుసగుసలు కూడా అప్పట్లో వినిపించాయి. ఇక ఆమె భార్య చనిపోయాక జాగర్ రెచ్చిపోయాడు. ఏకంగా హామ్రీని ఇంటికే తెచ్చేసుకున్నాడు. ఆమధ్య వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను ప్రచురించి ‘‘ఇప్పుడే పడక గది నుంచి బడలికతో వచ్చిన ఆది దంపతులు’’ అనే శీర్షికతో కథనాలు ప్రచురించేశాయి. అయితే ఇవేవీ వాళ్లకు ఆనట్లేదట. ఇక హామ్రీ అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటుందేమో ప్రోసీడ్ అయిపోతుంది.  అంతే మరీ ప్రేమంటే ఏమీ పట్టించుకోకపోవటమే కదా! కంటిన్యూ... కంటిన్యూ...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ