విపరీతమైన స్మార్ట్ ఫోన్ల పోటీ రంగంలో వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు మైక్రోసాఫ్ట్ వివిధ ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించింది. తాజాగా లూమియా 435 పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ ను అత్యంత తక్కువ ధరకు మార్కెట్ లోకి విడుదల చేసింది. భారత్ లో దీని ధర కేవలం రూ.5, 999 మాత్రమే. నాలుగు అంగుళాల స్క్రీన్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత చీప్ విండోస్ ఫోన్ ఇదే. డ్యుయెల్ సిమ్ సౌకర్యంతో వస్తున్న ఈ ఫోన్ లో 4800X800 రెజల్యూషన్, 1.2 జీహెచ్ జడ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ ఆధారిత 200 ప్రాసెసర్ తో ఉంటుందట. 1 జీబీ రామ్, ఇంటర్నల్ మెమొరీ 8 జీబీతో అదనపు సౌకర్యాలు కూడా ఉన్నాయని కంపెనీ చెబుతోంది.