29 న విండోస్ 10 గ్రాండ్ విడుదల

July 14, 2015 | 03:34 PM | 11 Views
ప్రింట్ కామెంట్
Microsoft_Windows10_Edge_Browser_niharonline

మైక్రోసాఫ్ట్ నూతన ఆపరేటింగ్ వర్షన్ విండోస్ 10 ఈ నెల 29న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రపంచంలోని పలు ప్రధాన నగరాల్లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో నూతన వెర్షన్ ను ఆవిష్కరించనున్నట్లు మైక్రోసాఫ్ట్ సోమవారం ఓ బ్లాగ్ లో పోస్ట్ లో అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో  ఉన్న అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ ల కన్నా విండోస్ 10 విండోస్ 10 వేగవంతమైనదే గాక సురక్షితమైనదని మైక్రోసాఫ్ట్ అభివర్ణించింది. విండోస్ 7, విండోస్ 8 ఒరిజినల్ వర్షన్లు వాడుతున్నారంటూ విండోస్ 10 ను ఉచితంగానే డౌన్ లోడ్ చేసుకోవచ్చని కూడా ప్రకటించింది. అయితే ఈ ఉచిత ఆఫర్ ఏడాది వరకు మాత్రమేనని కూడా వెల్లడించింది. 29 నే విడుదలవుతున్నప్పటికీ, అంత త్వరగా విండోస్ 10 వినియోగదారులకు అందుబాటులోకి రాదట. తయారీలో కీలక పాత్ర పోషించిన టెస్టర్ లకు మాత్రమే తొలుత దీనిని అందుబాటులో ఉంచుతారట. జూలై 29 తర్వాత కంప్యూటర్లు కొన్నవారికి ప్రాధాన్యమివ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. నూతన వర్షన్ లో స్టార్ట్ మెనూను జోడించిన మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ పేరిట సరికొత్త బ్రౌజర్ ను పొందుపరిచింది. తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానామిచ్చేందుకు ఇందులో కోర్టానా ప్రోగ్రామ్ పేరిట ప్రత్యేక వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటుందట.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ