జర్మనీలోని డ్యూస్సెల్డార్ఫ్ నగర పోలీసులు ఇప్పుడు యమా బిజీగా ఉన్నారు. ఎందుకో తెలుసా? తప్పిపోయిన ఓ పావురాన్ని పట్టుకోడానికి. ఒక పావురం కోసం ఇంత హంగామానా అని అనుకోకండి. మిస్ అయ్యింది ఆషామాషీ పావురం కాదు. దాని విలువ లక్షా యాభై వేల యూరోలట. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ. 1.20 కోట్లు. దానిని యజమాని అంతపెట్టి కొన్నారట. మిస్ అయిన పావురానికి పేరు కూడా ఉండందోయ్... ఏఎస్ 969. ఏదో ఫ్లైట్ నంబర్ లాగా ఉంది కదా. అరరె... ఇక ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఉంది. ఈ పావురం ఆచూకీ తెలిపిన వారికి 10 వేల యూరోలు( దాదాపు రూ.8 లక్షలు) బహుమతిగా ప్రకటించాడు దాని యజమాని. డ్యూస్సెల్డార్ఫ్ నగర శివార్లలోని పక్షిశాలలో ఉన్న ఈ పావురాన్ని శనివారం రాత్రి ఎవరో దొంగతనంగా ఎత్తుకెళ్లారని అతను ఆరోపిస్తున్నాడు.