న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ చాలా చిలిపివాడు. ప్రాక్టికల్ జోకులతో సరదగా ఉండటం ఆయన నైజం. అయితే, ఎప్పట్లానే తమాషా చేయబోయి కాస్తంత ఇబ్బంది పడ్డారు. ఆక్లాండ్ లోని ఓ కేఫ్ లో పనిచేస్తున్న వెయిట్రెస్ జట్టు పట్టుకుని లాగి, చివరకు క్షమాపణ చెప్పాడు. ఆమె పోనీ టెయిల్ ను ఎన్నోమార్లు లాగి కవ్వించేందుకు ప్రయత్నించారట . గతేడాది నవంబర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ కేఫ్ కు ప్రధాని వచ్చారట. ఇక అప్పటి నుంచి ఆ కేఫ్ కు ఎప్పుడు వచ్చినా తన పోనీ టెయిల్ ను లాగందే ఆయన నిష్క్రమించేవారు కారని ఆ వెయిట్రెస్ పేర్కొంది. తన జుట్టు అలా లాగటం తనకు ఇష్టంలేదని ఆయన భద్రత సిబ్బందితో కూడా చెప్పానని గుర్తుచేసుకుంది. చివరికి, గత నెలలో వ్యక్తిగతంగా మాట్లాడి అలా లాగవద్దని కోరానని తెలిపింది. అయినా వినలేదని, తన కొంటెతనాన్ని కొనసాగించారని వాపోయింది. చివరికి వాస్తవాన్ని గ్రహించి, క్షమాపణలు తెలిపి రెండు వైన్ బాటిళ్లు ఇచ్చారని వెల్లడించింది.