ప్రస్తుతం స్మార్ట్ ప్రతి ఒక్కరి చేతిలో దర్శనమిస్తుంది. వయోబేధం అన్నది తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ల వాడాకానికి అలవాటు పడిపోతున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్లు పెద్ద ప్రత్యేకం ఏం కాదు. ప్రతీ ఫోన్లో ఉన్నట్లే స్మార్ట్ ఫోన్లో కూడా ఫానెల్, బాడీ, అయోడ్లు, ప్రాసెసర్లు, చిప్ తదితర వస్తువులు ఉంటాయి. మోడళ్లను బట్టి ఒక్క ప్రాసెసర్లు మినహాయించి మిగతా ఎందులోనూ వాటి వినియోగం పెద్దగా ఉండదు. మరీ అలాంటప్పుడు వాటి ధర ఆకాశాన్ని ఎందుకు తాకుతున్నాయి అనేగా మీ అనుమానం. అక్కడికే వస్తున్నాం. స్మార్ట్ ఫోన్లలో మెజార్టీ భాగం ఉండేది టచ్ స్క్రీన్ మాత్రమే. మొత్తం ఫోన్లో అదే 40 శాతం ఫోన్ ను ఆక్రమిస్తుంది. ఇక ఈ టచ్ స్క్రీన్ ను ఇండియం టిన్ ఆక్సైడ్ అనే పరికరంతో తయారు చేస్తారు. దీని ధర చాలా ఎక్కువ. కేజీ ఇండియం టిన్ ఆక్సైడ్ 750 డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాల 50 వేలు. ఇక ప్రస్తుతం ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువు టచ్ స్క్రీన్ తోనే రూపుదిద్దుకుంటున్నాయి కదా అందుకే స్మార్ట్ ఫోన్లు అంతంత ధర పలుకుతున్నాయి.
అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఇండియం టిన్ ఆక్సైడ్ కు ప్రత్యామ్నాయం కనుగొనే పరిశోధనలో ఉన్నాయి. స్ట్రాంటియం వనడేట్ అనే పారదర్శక లోహం కూడా టచ్ స్ర్కీన్ కి బాగా సహకరించటంతో దానిని డెవలప్ చేసే పనిలో పడ్డారు. అంతేకాదు దాని ధర కేవలం కేజీకి 25 డాలర్లు 1700రూపాయలు మాత్రమే. ఈ ప్రయోగం గనక సక్సెస్ అయితే మాత్రం స్మార్ట్ ఫోన్ ధరలన్నీ పాతాళానికి పడిపోవాల్సిందే.