పెళ్లి కోసం అప్పులు... విడాకులంటే మాత్రం తిప్పలే!

December 18, 2015 | 03:31 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Seattle startup gives ten thousand dollars for marriage niharonline

ఐన్ ఐడియా కెన్ ఛేంజ్ యువర్ లైఫ్. ఓ ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ యాడ్ లో నిత్యం మనకు వినిపించే ఈ పదం అక్షరాల నిజం. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ, ఔత్సాహికుల మదిలో మెదిలే ఒక్క ఆలోచన వారిచేత ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం సియాటెల్ లో ఓ వినూత్న ఆలోచనతో మొదలైందో స్టార్టప్ కంపెనీ. ఇంతకీ ఈ సంస్థ చేసే పనేంటో తెలుసా? ఎవరైనా పెళ్లి చేసుకుందామనకుంటే చాలు వారికి 10 వేల డాలర్లను మన కరెన్సీలో అక్షరాల రూ. 6.5 లక్షలు అప్పుగా ఇస్తుంది. ఇక వారి కాపురం సజావుగా సాగినంత కాలం ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు. అయితే ఒకవేళ వారు విడాకులకు సిద్ధపడితే మాత్రం వడ్డీతో కలిపి చెల్లించాల్సిందే. ఆ వడ్డీ కూడా అసలు తీసుకున్న తేదీ నుంచి అమలులోకి వస్తుందట.

వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ ఇందులో కంపెనీకి వచ్చే లాభమేముంది అంటారా? ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో వారి నుంచి ఈ సంస్థకు భారీ లాభాలే రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇంతకీ ఈ  స్టార్టప్ పేరు చెప్పలేదు కదా 'స్వాన్ లవ్'. దీన్ని స్కాట్ అవీ అనే వ్యక్తి స్థాపించారు. తన మిత్రుడికి పెళ్లి కుదిరి, ఆపై వెడ్డింగ్ ఖర్చుల గురించి తనతో ప్రస్తావించిన వేళ ఈ ఆలోచన తట్టిందని స్కాట్ చెబుతున్నారు. తమ సంస్థలోకి ఇన్వెస్టర్లు వస్తారా? రారా? అన్న ఆలోచన ఇప్పటి వరకూ లేదని, భవిష్యత్తులో మాత్రం తప్పక లాభాలు వస్తాయని ఆశిస్తున్నట్లు అతను చెబుతున్నాడు. విదేశాల్లో విడాకులు కామన్ కాబట్టి ఓకే గానీ, అదే మనదేశంలో అయితేనా ఇటువంటి ఆలోచనలు అట్టర్ ఫ్లాప్ అవుతాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ