సోనీ పిక్చర్స్ పై జరిగిన సైబర్ దాడుల అనంతరం అమెరికా, ఉత్తర కొరియాల మధ్య అంతరం రోజురోజుకూ పెరుగుతోంది. ఉత్తర కొరియాకు ఇంటర్నెట్ సేవలను అమెరికా నిలిపివేయగా, ఒబామా ఓ కోతి, ఆయనవి కోతి చేష్టలని ఉత్తర కొరియా వ్యాఖ్యానించింది. సోనీ పిక్చర్స్ పై దాడుల్లో ప్రభుత్వ పాత్ర ఉందని వస్తున్న విమర్శలను ఖండించింది. సోనీ తీసిన ది ఇంటర్వ్యూలో తమ నేత కిమ్ జోంగ్ ఉన్ హత్యను హాస్యపూర్వకంగా చిత్రీకరించటంపై ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలని సోనీ నిర్ణయించినప్పటికీ ఒబామా ప్రోద్బలంతోనే చిత్రం విడుదలైందని కొరియా పోలీసు అధికారి ఒకరు ఆరోపించారు. ఈ చిత్రం చట్ట వ్యతిరేకమని, నిజాయితీతో తీయలేదని, ప్రతీకార చర్యలను ప్రోత్సహించేదిగా ఉందని విమర్శించారు.