అమెరికా ఆంక్షలు ఎత్తివేయాల్సిందే : ఉత్తర కొరియా

January 09, 2015 | 03:31 PM | 35 Views
ప్రింట్ కామెంట్

మా దేశంపై విధించిన నిర్హేతుకమైన ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాల్సిందిగా ఉత్తర కొరియా (డిపిఆర్‌కె) బుధవారం అమెరికాను కోరింది. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుదల విషయమై దక్షిణ కొరియా తన వైఖరిని స్పష్టం చేయాలని అది కోరింది. తమ దేశం పట్ల అమెరికా అనుసరించే శత్రు వైఖరికి అనుగుణంగానే ఇప్పటివరకు ఆ దేశం తీసుకున్న చర్యలు వున్నాయని, అందులో భాగమే డిపిఆర్‌కెపై విధించిన ఆంక్షలని ఉత్తర కొరియా జాతీయ రక్షణ కమిషన్‌ (ఎన్‌డిసి) విధాన విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. కొరియా ద్వీపకల్పంలో యుద్ధ ప్రమాదాన్ని సృష్టించేలా నిర్లక్ష్యపూరితమైన, ఘర్షణాయుత చర్యలను తక్షణమే నిలిపివేయాలని ఆ దిశగా అమెరికా సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని అది కోరింది. ఏడాది ప్రారంభం నుండి కూడా డిపిఆర్‌కె-అమెరికా మధ్య సంబంధాలు ఘర్షణాయుత దశకు చేరుకునేలా అమెరికా వ్యవహరించిందని ఉత్తర కొరియా ఆరోపించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ