పాకిస్థాన్ ఓ ముస్లిం దేశం. అంతకు మించి మత పిచ్చి తో రగిలిపోయే ఓ సామ్రాజ్యం. ఉగ్ర రాక్షసులు అక్కడి హిందువులను దారుణంగా హింసించి క్రూరాతి క్రూరంగా చంపిన ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. అదే టైంలో తాను పెంచి పోషించిన పాము తననే కాటేసినట్లు... ఉగ్ర కోరల్లో ఆ దేశం నలిగిపోతూ వస్తుంది. మానవతా వాదంతో మనం మెదిలినా కవ్వింపు చర్యలతో రెచ్చగొడుతూ వస్తూ పైశాచిక ఆనందం పొందడం పాక్ కు కొత్తేమీ కాదు. అలాంటి దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఓ తీర్పు ఇఫ్పుడు చర్చనీయాంశంగా మారింది.
కూల్చేసిన ఓ దేవాలయాన్ని తిరిగి కట్టాల్సిందిగా పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత పాక్లోని కరాక్ జిల్లాలో శ్రీ పరమహంస జీ మహరాజ్ మరణించారు. ఆయన్ను ఆరాధించే శిష్యులు ఒక దేవాలయాన్ని అప్పట్లో నిర్మించారు. 1997 వరకూ ఆ గుళ్లో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ దేవాలయాన్ని కూల్చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో ఒక దరఖాస్తు దాఖలైంది. తాజాగా ఈ కేసును విచారించిన పాక్ సుప్రీంకోర్టు.. ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చేసిన ఈ దేవాలయాన్ని నిర్మించాల్సిందేనని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ముగ్గురు సభ్యులున్న ధర్మాసనం దేవాలయాన్ని తిరిగి నిర్మించాలన్న అంశాన్ని తేల్చి చెబుతూ నిర్ణయాన్ని వెలువరించింది. అంతేకాదు.. హోంశాఖ కార్యదర్శి.. ఎవరెవరితో కలిసి చర్చించి.. ఈ దేవాలయాన్ని తిరిగి నిర్మించాలో కూడా స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు.. చుట్టుపక్కల ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా.. దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. తాను పేర్కొన్న నిపుణులతో దేవాలయ నిర్మాణం గురించి చర్చించి.. ఆ విషయాల్ని కోర్టుకు తెలపాల్సిందిగా చెబుతూ.. ఈ కేసును సెప్టెంబరు 7కు వాయిదా వేసినట్లు పాక్ పత్రిక డాన్ పేర్కొంది. 1919లో ఈ ప్రాంతం భారతదేశంలో భాగంగా ఉండేది. పాక్ విభజన తర్వాత మత ఘర్షణల్లో ఎక్కువ మంది హిందువులు ప్రాణాలు కోల్పోయింది ఇక్కడే కావటం గమనార్హం.