పాకిస్థాన్ మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టింది. కోట్లు విలువ చేసే కోహీనూర్ వజ్రం గుంటూరులోని కొల్లూరు గనుల్లో దొరికిందన్నది జగద్విదితం. అలాంటిది కోహీనూర్ తమ దేశానికి చెందిందని పాక్ ఇప్పుడు వితండవాదానికి దిగుతుంది. కోహినూర్ వజ్రాన్ని ఎలాగైనా పాకిస్థాన్ ప్రభుత్వం తమ దేశానికి తీసుకురావాలని ఆ దేశ న్యాయవాది అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మహారాజు రంజిత్ సింగ్ మనవడు దిలీప్ సింగ్ దగ్గర్నుంచి బ్రిటన్ కోహినూరు వజ్రాన్ని దోచుకెళ్లిందని న్యాయవాది జావెద్ ఇక్బాల్ జాఫ్రీ ఆరోపించారు. 1953లో క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకం సమయంలో ఆమె కిరీటంలో పొదిగారని, ఆ వజ్రంపై వారికి ఎలాంటి హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. కోట్ల విలువ చేసే కోహినూర్ వజ్రం పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రజల ఆస్తి అని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, దీని కోసం భారత ప్రభుత్వం దశాబ్దాలుగా పోరాడుతున్నారు. బ్రిటన్ లోని ఓ స్వచ్ఛంద సంస్థ దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు సమాచారం. ఈ దశలో కోహినూర్ వజ్రం మాదని పాక్ పాడుబుద్ధిని బయటపెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.