శామ్ సంగ్ పై ఫైర్ అయిన సాకర్ దిగ్గజం

March 30, 2016 | 03:47 PM | 2 Views
ప్రింట్ కామెంట్
samsung_brazil_pele_suit_niharonline

ప్రపంచవ్యాప్తంగా బాగా పేరొందిన ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శామ్ సంగ్ పై బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే ఫైర్ అవుతున్నాడు. ఆ కంపెనీ ఓ  ప్రకటనలో తనను పోలిన ఫొటోను వాడుకుందని, అందుకు తన అనుమతి తీసుకోలేదని ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు సదరు సంస్థపై దావా వేశాడు.

                             శామ్ సంగ్ సంస్థపై 30 మిలియన్ డాలర్లకు కేసు ఫైల్ చేశాడు. గత ఏడాది అక్టోబర్ లో శామ్ సంగ్ తన కొత్త మోడల్ టీవీలపై ఒక ప్రకటన ప్రచురించింది. ఈ పేపర్ ప్రకటనలో పీలే లా కన్నించే ఒక వ్యక్తి ఫొటోతో పాటు, సిజర్స్ కిక్ ఆడుతున్న ఒక ఫుట్ బాల్ క్రీడాకారుడి చిన్న సైజు ఫొటోను ప్రచురించింది. సిజర్స్ కిక్ అనేది పీలే ప్రత్యేకతగా చెబుతారు. ఈ ప్రకటనకు సంబంధించి పీలే నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ నెల 16న ఈ కేసు పెట్టినట్లు తెలియజేశారు. కాగా, ఈ విషయమై స్పందించేందుకు శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులు నిరాకరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ