వినండహో: పోప్ నోట కండోమ్ మాట!!!

February 20, 2016 | 12:45 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Pope-condom-hint-stop-Zika-virus-spread-niharonline

బ్రెజిల్ తో పాటు పలు దేశాలను జికా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా దేశాల్లో శిశువులు చిన్న మెదడులో లోపాలతో పుట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలు అబార్షన్ లకు మొగ్గుచూపుతున్నారు. దీనిపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. అబార్షన్ అంటే ప్రాణం పోసుకుంటున్న వ్యక్తిని హతమార్చడమేనని అభిప్రాయపడ్డ ఆయన, అబార్షన్లు మానవాళికి మంచిది కాదని అన్నారు. దీనికి బదులుగా గర్భనిరోధక పద్ధతులు పాటించడం మంచిదని, కండోమ్ వినియోగించవచ్చని ఆయన సూచించారు. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు అబార్షన్ ఒక్కటే మార్గం అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఐదు రోజుల పాటు మెక్సికో పర్యటించిన పోప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెచ్ఐవీ, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడేందుకు కండోమ్‌లను వాడాల్సిందేనని పోప్ వెల్లడించారు. మరోవైపు జికా దెబ్బకి అనేక దేశాలు అప్రమత్తమయ్యాయి. ఐర్లాండ్ ఓ ముందు అడుగువేసి తమ దేశానికి చెందిన పర్యాటకులు వస్తే, లేదా ఎవరైనా ఆఫ్రికా, అమెరికా దేశాలు వెళ్లాల్సి వస్తే,  నెలరోజుల పాటు కండోమ్ వాడాలని ఆదేశాలు జారీ చేసింది.  జికా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారు ఆరునెలల పాటు కండోమ్ వాడాలని, వ్యాధి లక్షణాలు ఉన్నవాళ్ళు రక్తదానం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ