అమెరికా-రష్యా చేతులు కలిస్తే బాంబుల మోతే

November 27, 2015 | 02:32 PM | 1 Views
ప్రింట్ కామెంట్
obama-putin-hands-together-to-fight-against-terrorism-niharonline

ఉగ్రపెనుభూతం అగ్రరాజ్యాలను సైతం వణికిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అమెరికా కూడా గజగజలాడి వైట్ హౌజ్ ను మూసివేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేందుకు రష్యా, అమెరికాలు ఒకేతాటిపై వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. పారిస్ ఘటనతోపాటు వరుసగా జరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ రెండు పెద్ద దేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. నిజానికి ఆ రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వం ఏంటో మనందరికీ తెలసిందే. ప్రతీ విషయంలో పోటీతోపాటు, పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంతేందుకు ప్రస్తుతం నడుస్తున్న సిరియా అధ్యక్ష పాలనను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రకటనలు ఇస్తుంటే, రష్యా మాత్రం ఆయనకు మద్ధతు ఇస్తూ వస్తుంది.

                                అయితే పారిస్ ఘటనతోపాటు తాజాగా తమ దేశానికి చెందిన విమానాన్ని కూల్చివేయటంపై రష్యా గరంగా ఉంది. ఈ నేపథ్యంలో సిరియాలో ఉన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అణగదొక్కే యుద్ధానికి సిద్ధమౌతున్న తమకు సహకరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ఒబామాను కోరారు. అమెరికా అంతరిక్షంలో ఉంచిన అత్యాదునిక శాటిలైట్ల ద్వారా ఉగ్రవాదుల అనుపానులను గుర్తించి, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వివరాలను చెబితే, తాము నిమిషాల్లో అక్కడికి వెళ్లి విధ్వంసం సృష్టించి వస్తామని పుతిన్ వెల్లడించారు. సరైన ప్రాంతం గురించిన సమాచారం లేకుండా వెళితే, సామాన్యుల ప్రాణాలు కూడా పోతున్నాయని, అందువల్ల సరిగ్గా ఎక్కడ బాంబుల వర్షం కురిపించాలో తెలియజేయాలని పుతిన్ కోరారు.

మొత్తానికి భిన్న దృవాల్లాంటి రెండు దేశాలు ఉగ్రవాదంపై పోరు కోసం ఒకేతాటికి రావటం నిజంగా అభినందనీయం. తద్వారా ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహ పెకిలించే అవకాశం లేకపోలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ