న్యూడ్ పెయింటింగ్... 1100 కోట్లు!

November 17, 2015 | 03:45 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Rs 1100 Crore for nude painting paid by former taxi driver

పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు బట్ట అవసరం లేదు. నగ్నత్వంపై తెలిసిన ఫిలాసఫీయే ఇది. అయితే నగ్నత్వం అంటే ఆసక్తి లేనిది ఎవరికి చెప్పండి. న్యూడిటీ అనేది ఎప్పుడూ సంచలనమే. మూసిన గుప్పిట విప్పటమంటే ప్రతీ మనిషికి ఆరాటమే కదా. ప్రేక్షకుల కోసం కొంతమంది హీరోయిన్లు సాహసం చేసినా సెన్సార్ వాళ్ల కత్తెరలకు బలికాక తప్పటం లేదు. కానీ అలాంటి వాళ్ల కోసం ఉన్న ఒకే ఒక మార్గం పెయింటింగ్. చిత్రలేఖనం ద్వారా నగ్నత్వ కోణాలను ఆవిష్కరించిన చిత్రకారులెందరో. అందులో విభిన్న కోణాలను ఆవిష్కరించిన నగ్న చిత్రాలకు గిరాకీ కూడా ఎక్కువే. ఇక తాజాగా ఓ నగ్న చిత్రం కళ్లు చెరిరే రేటుకు అమ్ముడుపోయి సంచనలం సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 1100 కోట్ల రూపాయల ధర పలికింది.

మరి ఇంత ధర పెట్టి కొనుక్కున్న వ్యక్తి సామాన్యుడు అయి ఉండడు కదా. కానీ అతను సామాన్యుడే. గతంలో లీ యిక్వియాన్ ఓ ట్యాక్సీ డ్రైవర్ కావడం విశేషం. వారెన్ బఫెట్ తరహాలో స్టాక్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడులు పెట్టి చైనా కోటీశ్వరుల జాబితాలో చేరిపోయాడు. సామాన్యుడి స్థాయి నుంచి అపర కోటీశ్వరుడుగా మారిన ఆ వ్యక్తి గతంలోనూ అనేక పెయింటింగులు రికార్డు స్థాయి ధరకు కొన్నాడట. మరి అలాగని అతడిని తక్కువ అంచనా వేయకండి. ఏ పెయింటింగు ఎంత ధరపలుకుతుంతో అంచనా వేయడంలో ఈయన సిద్ధహస్తుడట. ఈయన భార్య ఓ ప్రైవేట్ మ్యూజియం నిర్వహిస్తోందట. దాని కోసమే  లీ యిక్వియాన్ ఈ పెయింటింగ్ కొన్నాడట.

ఇన్ని సంచలనాలకు కారణమైన.. ఈ హైయ్యెస్ట్ పెయిడ్ న్యూడ్ పెయింటింగ్ గీసిన వ్యక్తి పేరు అమెడియో మోడిగ్లియా. ఈ చిత్రం పేరు న్యూడో రోసా. అంటే నగ్నంగా ఉన్న మహిళ అని అర్థం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ