ఐ ఫోన్ కోసం వాట్స్ యాప్ కొత్త ఫీచర్

November 16, 2015 | 05:07 PM | 2 Views
ప్రింట్ కామెంట్
whatsapp_Pop 3D Touch Support_niharonline

వాట్స్ యాప్ వినియోగదారులకు మరో ఫీచర్ రానుంది. ఐఫోన్ యూజర్ల కోసం వాట్స్ యాప్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ను అందిస్తోంది. 'పీక్ అండ్ పాప్' పేరిట ప్రవేశపెట్టిన ఆ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు వచ్చే మెసేజ్ లలో కంటెంట్ ను ఓపెన్ చేయకుండా ముందుగానే ప్రివ్యూ రూపంలో చూసుకోవచ్చు. దాంతో పాటు సదరు కంటెంట్ మెసేజ్ ను అలాగే ప్రెస్ చేసి పట్టుకుంటే, దాన్ని వాట్స్ యాప్ ఆటోమేటిక్ గా ఓపెన్ చేస్తుంది. అయితే ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ వంటి నూతన తరహా ఐఫోన్ మోడల్స్ లోనే ఈ ఫీచర్ సమర్థవంతంగా పనిచేస్తుందని వాట్స్ యాప్ ప్రతినిధులు తెలిపారు. మిగతా ఫోన్లకు కూడా త్వరలో దీనిని వర్తింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ