లైంగిక దాడి ఆరోపణలతో అరస్టయిన బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్ కు బెయిల్ దొరికింది. ఈ కేసులో ఛార్జీషీటు నమోదు చేసే వరకు అతడికి బెయిల్ ఇస్తున్నట్లు ఢాకా కోర్టు ప్రకటించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మోడల్(19) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ ముగియడంతో ఈ నెల 8న హుస్సేన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆయనకు మరోసారి బెయిల్ లభించడంతో తిరిగి బంగ్లాజట్టులోకి తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.