10 లక్షల బీర్ బాటిళ్లు వెనక్కి వచ్చేశాయ్

December 05, 2015 | 04:39 PM | 3 Views
ప్రింట్ కామెంట్
carlton-dry-recall-1-million-beers-back-niharonline

మద్యపానం ఆరోగ్యానికి హనికరం అంటూ ఓ వైపు ప్రకటనలను ఇస్తూనే మందుబాబులకు పసందైన మద్యాన్ని సరఫరా చేస్తు మద్యం కంపెనీలు లాభపడుతున్నాయి. అడపాదడపా అవి వికటించి మంది ప్రాణాలు పోతున్న పట్టించుకోని రోజుల్లో కంపెనీకి నష్టం వచ్చినా సరే అలాంటి పని చేయలేదు ఓ కంపెనీ. కొన్ని మద్యం బాటిళ్లలో గాజుపెంకులు వచ్చాయని ఫిర్యాదు అందటంతో ఏకంగా పది లక్షల బీర్ బాటిళ్లను వెనక్కి రప్పించింది సదరు కంపెనీ. ఆస్ట్రేలియాకు చెందిన శాబ్ మిల్లర్ అనే ఓ బీర్ కంపెనీ తమ కార్లటన్ బీర్లను వెనక్కి రప్పించింది. 335 మిల్లీ లీటర్ల సామర్థ్యం ఉన్న బీరు బాటిళ్లలో చిన్న గాజు పెంకులు వస్తున్నట్టు 12కు పైగా ఫిర్యాదులు అందాయట. దాంతో వెంటనే అంతర్గతంగా పరిశీలన చేసుకున్న కంపెనీ క్వీన్స్ లాండ్ బాట్లింగ్ ప్లాంట్ నుంచి వెళ్లిన బీరు బాటిళ్లలో ఆ ఫిర్యాదులు వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. గత అక్టోబర్ లో వాటిని సరఫరా చేశారని, బాట్లింగ్ సమయంలోనే లోపం వచ్చి ఉంటుందని కంపెనీ అధికారులు భావిస్తున్నారు. అయితే లక్షల కొద్ది బాటిళ్లు వెనక్కి తీసుకోవడం వల్ల పెద్దగా నష్టమేమి లేదని చెబుతున్నారు. ఇదే ఇండియాలో అయితేనా పాములు, పురుగులు వచ్చినా పిచ్చ లైట్ తీస్కుంటారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ