సమోసాలు... సమోసాలో... అంటూ మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో స్నాక్స్ అమ్మకందారులు కలయతిరగటం చూస్తూంటే అది ఆస్ట్రేలియానా లేక ఇండియాలోని ఏదో క్రికెట్ మైదానంలో కూర్చున్నామా అనిపించింది క్రీడాభిమానులకు. గురువారం భారత్ బంగ్లా మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారతీయులతోపాటు బంగ్లాదేశీయులకు ఇష్టమైన ఆహార పదార్థాలలో ఒక్కటైన సమోసాల అమ్మకం జోరుగా సాగింది. ఈ మ్యాచ్ చూడటానికి ఉపఖండం నుంచి భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని ముందే ఊహించిన మెల్ బోర్న్ స్టేడియం నిర్వాహకులు సమోసాలను మెనూలో చేర్చారు. ఇలా ఓ భారతీయ వంటకాన్ని మెల్ బోర్న్ స్టేడియం మెనూలో చేర్చటం ఇదే తొలిసారట. అయితే ధర మాత్రం చాలా ఎక్కువండోయ్. ఎంతో తెలుసా? రెండు సమోసాలు ధర 5.60 ఆస్ట్రేలియన్ డాలర్లు...అంటే మన కరెన్సీలో రూ.250 అన్నమాట. క్రికెట్ మైదానంలో సాధారణంగా చికెన్ హాట్ డాగ్, బర్గర్లు ధర కూడా ఇంతే ఉంటుదట. ఏదేమైనా మన సమోసా మనదగ్గరే కాదు విదేశాల్లో కూడా చాలా హాట్ గురూ...