ప్రపంచ వ్యాప్తంగా గ్రహాంతర జీవులపై ఎన్నో కథలు, ఊహాగానాలు ఉన్నాయి. ఇంలాటి దిశలో నాసా చేసిన ఓ ప్రకటన ఇప్పుడు సర్వసృష్టిలో సంచలనం సృష్టిసుంది.
కాలిఫోర్నియాలోని సేటి ఇనిస్టిట్యూట్ లో గ్రహాంతరవాసులు మరియు అంతరిక్షంలో జీవం ఉందా లేదా అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. నథాలీ కాబ్రోల్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. వీరి కథనం ప్రకారం గ్రహాంతర వాసులు ఉన్నారని... అయితే.. ఇతర గ్రహాల నుంచి వచ్చే సిగ్నళ్లను పట్టుకోలేకపోవడం వల్లే వారిని గుర్తించలేకపోతున్నామని అంటున్నారు. అయితే గ్రహాంతర జీవులను చేరడానికి మనం తగ్గరలోనే ఉన్నామని... త్వరలో మనం వీరిని చేరడం సాధ్యమవుతుందన్న విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. రాబోవు 20-30 ఏళ్లలో గ్రహాంతర వాసులను కనిపెడతామని సూచిస్తున్నారు. ఈ ఏడాది 10 రకాల రేడియో సిగ్నళ్లను అంతరిక్షం నుంచి శాస్త్రవేత్తలు గుర్తించారట... అవి భూమికి వందకోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి వచ్చినట్లు చెబుతున్నారు.