మక్కాలో మరో ఘోరం: తొక్కిసలాట, 500మంది మృతి?

September 24, 2015 | 04:56 PM | 2 Views
ప్రింట్ కామెంట్
stampede_mecca_masjid_saudi_arabia_500-niharonline

 మక్కాలో మరో ఘోరం చోబుచేసుకుంది. క్రేన్ కూలి 107 మంది మరణించిన ఘటన మరువక ముందే మరో దుర్ఘటన జరిగింది. హజ్ యాత్ర సందర్భంగా గురువారం పెద్ద ఎత్తున గుమిగూడగా తొక్కిసలాట చోటుచేసుకుంది. మరణించిన వారి సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోంది. మృతుల సంఖ్య 500 దాటే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. తొలుత ఈ ఘటనలో 100 మంది చనిపోయారని, ఆ తరువాత 220 మంది చనిపోయారని ప్రకటించిన మక్కా ప్రభుత్వ అధికారులు ఇప్పుడు 310 మంది మృతి చెందారని లెక్కగట్టారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది తీవ్రగాయాలతో ఉన్నారని, కాలం గడిచేకొద్దీ వీరిలో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

వివిధ ఆసుపత్రులలో 800 మందికి పైగా చికిత్సలు పొందుతున్నారని, కనీసం 500 మందికి పైగా యాత్రికులకు అవయవాలు విరిగాయని తెలుస్తోంది. ఈ ఘటన తరువాత గంటపాటు సైతానును రాళ్లతో కొట్టే కార్యక్రమాన్ని నిలిపివేసిన సౌదీ ప్రభుత్వం, ఆ తరువాత లక్షల మంది యాత్రికుల సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని తిరిగి అనుమతించింది. హజ్ యాత్ర చివరి రోజున సైతానును 9 రాళ్లతో కొట్టిన తరువాత మాత్రమే యాత్ర పరిసమాప్తి అయినట్టు ముస్లిం సమాజం విశ్వసిస్తుందన్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ