30 ఏళ్ల తర్వాత ఆ వింత మళ్లీ!!

September 16, 2015 | 11:42 AM | 2 Views
ప్రింట్ కామెంట్
moon-very-close-to-earth-on-eclipse-after-30-years-niharonline

దాదాపు 30 సంవత్సరాల క్రితం ఆవిష్కృతమైన ఆ వింత మరోసారి రానుంది. మరో పదకొండు రోజుల్లో ఆ వింతకు భూమీ వేదిక కానుంది. ఈ నెల 27 న చంద్రగ్రహణం ఉంది. అదే రోజున ఓ ఖగోళ వింత కూడా జరగనుంది. అదే భూమికి చేరువగా చంద్రుడు రావటం.

మూడు దశాబ్దల తర్వాత మళ్లీ రిపీట్ కానున్న ఈ దృశ్యానికి ఉత్తర, దక్షిణ అమెరికాలతోపాటు పశ్చిమ ఏషియా, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో కనువిందు చెయ్యనుంది. ఈ నెల 27 న అర్థరాత్రి సమయంలో సుమారు 1.12 నిమిషాలకు ఈ దృశ్యం కనిపించనుందట. భారత కాలమానం ప్రకారం అయితే.. 28న ఉదయం 5.41 గంటలకు భూమి నీడ చంద్రుడి మీద పడటం మొదలవుతుందని చెబుతున్నారు.

ఇక ఈ అరుదైన ఖగోళ వింత మొత్తంగా భూమికి దగ్గరగా వచ్చే చంద్రుడ్ని చూసేందుకు మీరూ సిద్ధమైపోండి. చుక్కల్లో ఉండే చంద్రడు చెంతకు వస్తానంటే మనం వద్దంటామా? మరో పదకొండు రోజులేగా. గెట్ రెడీ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ