తనను కాపాడినందుకు బీర్ పార్టీ ఇచ్చిన యువతి

October 23, 2015 | 12:35 PM | 3 Views
ప్రింట్ కామెంట్
young-women-gives-beer-party-niharonline.jpg

ఒంటరిగా బస్సులో ప్రయాణిస్తున్న యువతిని వేదించిన ఓ ఆకతాయిని  పక్కనే ఉన్న మరో వ్యక్తి వాడి క్లాస్ పీకడమే కాకుండా వార్నింగ్ ఇవ్వడంతో వాడు వెనక్కు తగ్గాడు. ఆకతాయి వలలో నుండి తేరుకున్న ఆ యువతి తనను కాపాడిన వ్యక్తిని గురించి చూడగా అతను కనిపించలేదు. ఎలాగైనా అతన్ని కలుసుకోవాలని ఆరా తీసిన యువతికి ఆచూకి తెలయడంతో ఆ వ్యక్తి కి బీరు పార్టీ ఇవ్వడమే కాకుండా, తనను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పింది.
అసలు విషమేంటంటే... లండన్ కాలేజీలో పీహెచ్ డీ చేయడంతో పాటు ఓ టీవీ ప్రోగ్రామర్ గా పనిచేస్తున్న కత్లిన్ రెగర్ అనే యువతి గత వారం ఓ బస్సు ఎక్కింది. బస్సులో రద్దీ లేకపోవడంతో ఓ యువకుడు ఆమెను దగ్గరకు లాక్కొని అసభ్యంగా ప్రవర్తించాడు. అదే బస్సులో ఉన్న మరో వ్యక్తి, అతనిని తిట్టి కట్టడి చేశాడు. అంతలో తన గమ్యం రావడంతో దిగిపోయాడు. అతన్ని కలుసుకోవాలని భావించిన కెత్లిన్ 'మంచి రక్షకుడు' అని టైటిల్ పెట్టి జరిగినదంతా ఫేస్ బుక్ లో పంచుకుంది. ఎర్రగా ఉన్నాడని, గడ్డం మీసాలను అందంగా ట్రిమ్ చేసుకున్నాడని చెబుతూ, అతన్ని వెతకడంలో సహకరించాలని కోరింది. ఆమె పోస్టును 86 వేల మంది షేర్ చేసుకున్నారు. వారం రోజుల్లో అతనెవరో తెలిసిపోయింది. ఫిరాత్ ఓజ్ సెలిక్ అనే వ్యక్తి ఆమెను కాపాడాడని నెటిజన్లు పట్టేశారు. అతడిని కత్లిన్ కు కలిపారు. ఆమె ఆనందంతో అతడికి పార్టీ ఇచ్చింది. కృతజ్ఞతలు తెలిపింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ