చిలీలో భారీ భూకంపం... సునామీ వార్నింగ్

September 17, 2015 | 10:03 AM | 1 Views
ప్రింట్ కామెంట్
chili-earthqquake-tsuami-warning-niharonline

దక్షిణ అమెరికాలోని చిలీ గురువారం ఉదయం వణికిపోయింది.  నేటి ఉదయం  ఆ దేశంలో భారీ భూకంపం సంభవించింది. తొలుత రిక్టర్ స్కేలుపై 8.3 గా నమోదవ్వగా, ఆ తర్వాత భూమి 6 సార్లు కంపిచింది. అవి కూడా రిక్టర్ స్కేలుపై 6 కన్నా ఎక్కువగానే నమోదయ్యాయి. భూకంపం కారణంగా పేక మేడల్లా భవనాలు కూలిపోయాయి. ఇక సునామీ హెచ్చరికలు కాలిఫోర్నియా నుంచి న్యూజిలాండ్ వరకు జారీ అయ్యాయి.

                              ప్రకంపంనలతో భవనాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. చిలీతోపాటు పెరూ, హవాయి దేశాల్లో కూడా ఈ ప్రకంపనల తాకిడి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అలలు చిలీ తీరాన్ని కూడ తాకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దేశం భయం గుప్పిట్లో బిక్కు బిక్కు మంటోంది. ఎప్పుడు ఏం అవుద్దో అని భయంతో వణికిపోతున్నారు.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ