ప్రేయసి ఘాటు ముద్దుకు ఆస్పత్రి పాలయ్యాడు

March 05, 2016 | 04:44 PM | 3 Views
ప్రింట్ కామెంట్
lover-deep-kiss-tongue-cut-niharonline

ప్రేమ మత్తులో ప్రియురాలిని కౌగిలించుకోవాలని... మరీ ముందుకు వెళ్లి ముద్దు పెట్టుకోవాలని ఎవరైనా అనుకోవటం కామన్. ప్రియురాలికి కూడా అంతే. అయితే నిజమైన మత్తులో తూగిన ఆ ప్రేయసి తన ప్రియుడికి ఎప్పటికి గుర్తిండిపోయేలా ఓ ముద్దు పెట్టాలని అనుకుంది. పెట్టేసింది కూడా. అయితే ఆమె ఘాటు ముద్దు దెబ్బకు ప్రియుడు ఆస్పత్రి పాలయ్యాడు. అసలేం జరిగిందంటే...

అమెరికాలోని కనెక్టికట్ లో హార్ట్ ఫోర్డ్ సిటీలో షకియా లాంగ్ అనే 37 ఏళ్ళ మహిళ తన ప్రియుడు 41 ఏళ్ళ డ్వేన్ విలియమ్స్ తో కలిసి సహజీవనం చేస్తోంది. ఈ మధ్య ఇద్దరూ కలిసి ఇంట్లో మత్తు పదార్థాలను మోతాదుకు మించి తీసుకున్నారు.  అనంతరం విలియమ్స్ ను కిస్ చేస్తూ.. షకియా లాంగ్ అతని నాలుకను కొరికేసింది. ఒక్కసారిగా నాలుక తెగిపోవడంతో బయటకు పరిగెత్తిన విలియమ్స్ అటుగా వెళ్తున్న పోలీసు సహాయంతో ఆసుపత్రికి చేరాడు.

               ఇక షకియాపై కేసు కూడా నమోదు చేశారు కూడా. తెగిపడిన నాలుకకు వైద్యులు అతికష్టం మీద అతికించారు. ఘటన జరిగిన సమయంలో చాలా రక్తం పోయిందని విలియమ్స్ పోలీసులకు తెలిపాడు. మార్చ్ 31న ఈ కేసుకు సంబంధించి షకియా కోర్టుకు హాజరుకానుంది. అయితే ఆసమయంలో విలియమ్స్ గాయపడిన సంగతే తనకు తెలియదని షకియా చెబుతుండటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ