మలాలకు అరుదైన గౌరవం

April 11, 2015 | 11:47 AM | 25 Views
ప్రింట్ కామెంట్
malala_yousafzai_asteroid_niharonline

కరడుగట్టిన ఉగ్రవాదులను ఎదిరించి బాలికల విద్య కోసం పోరు సాగించి పిన్న వయస్సులోనే నోబెల్ శాంతి బహుమతి దక్కించుకున్న పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్ జాయ్. తాజాగా ఆమె మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఆమె పోరాట పటిమకు మెచ్చి అమెరికా ఖగోళ శాస్త్రవేత్తలు ఓ ఉల్కకు ఆమె పేరు పెట్టారు. 316201 ఉల్కకు మలాలా పేరు పెట్టినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్ర నాసాలోని ల్యాబ్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఉల్కకు మలాలా పేరు పెట్టడాన్ని గొప్ప విషయంగా పేర్కొన్న నాసా ఖగోళ శాస్త్రవేత్త ఎమీ మైంజర్ గతంలో చాలా మందికి ఈ తరహా గౌరవం దక్కినప్పటికీ మహిళల కోసం పనిచేసిన మహిళకు ఈ గౌరవం దక్కడం చాలా అరుదైనదేనని అభివర్ణించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ