వాట్సాప్ లో ఇక ఆ ముచ్చట కూడా!

December 23, 2015 | 02:30 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Whatsapp-video-calling-feature-Techniblogic

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలో వాట్సాప్ ది ప్రత్యేక స్థానంగా చెప్పుకోవచ్చు. పదే పదే లాగిన్ లాంటి అవసరం లేకుండా ఫోన్ నంబర్ తో ఒక్కసారి ఇన్ స్టాల్ చేసుకుని సర్వీస్ ను ఎంజాయ్ చేసే సౌకర్యం దీని సొంతం. ఇన్నాళ్లు దీనిలో వీడియో కాలింగ్ సౌకర్యం మాత్రం లేదు. అయితే రానున్న రోజుల్లో  వాట్స్ యాప్ లో వీడియో కాలింగ్ సౌకర్యం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన వాట్స్ యాప్ లో మెసేజింగ్, కాలింగ్ సౌకర్యం ఉంది. అయితే స్కైప్, హ్యాంగవుట్స్ మాదిరి దీనిలో  వీడియో కాలింగ్ సౌకర్యం లేకపోవడంతో ఆదరణ కాస్త తక్కువగానే ఉండేది. ఆ లోటును భర్తీ చేస్తూ వాట్స్ యాప్ లో వీడియో కాలింగ్ సౌకర్యం అందుబాటులో తెచ్చేందుకు ప్రయోగాలు నడుస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉందని, త్వరలో విడుదల చేయనున్న ఐవోఎస్ వెర్షన్ లో ఈ సౌకర్యం కల్పించనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. వీడియో కాల్ మాట్లాడుతూనే ఫోటోలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి జర్మనీలో దీనికి సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ నడుస్తోందని జర్మన్ వెబ్ సైట్ తెలిపింది. దీనికి సంబంధించిన స్క్నీన్ షాట్ లను విడుదల కూడా చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ