క్రేజీ వీడియో: పార్కింగ్ కోసం పిచ్చి కొట్టుడు కొట్టింది

April 30, 2015 | 03:46 PM | 27 Views
ప్రింట్ కామెంట్
woman_fighting_parking_niharonline

మంచి నీటి కోసం ట్యాంకర్ల దగ్గర, చేతి పంపుల దగ్గర ఆడాళ్ల సిగపట్లు మనకు కొత్తేంకాదు. కానీ, అగ్రరాజ్యం అమెరికాలో అసలు గొడవ పడేందుకు ఆస్కారం లేని చిన్న వివాదంలో ఇద్దరు మహిళలు నడిరొడ్డుపై కొట్టుకున్నారు. ఈ కుస్తీలో బొద్దుగా ఓ మహిళ బక్కగా ఉన్న ఓ మహిళను కిందపడేసి మరీ ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. ఈ గొడవను ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ తో చిత్రీకరించి యూ ట్యూబ్ లో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్లితే... న్యూయార్క్ కు చెందిన వ్యాలీ స్ట్రీమ్ లోని గ్రీన్ ఎక్సర్ మాల్ ఎదుట ఆదివారం తన కారును పార్కింగ్ చేసేందుకు 24 ఏళ్ల లటోయిమా సిద్ధపడింది. తన కారు పార్కింగ్ కోసం ఎంచుకున్న స్థలాన్న మరో వ్యక్తి కాస్త ముందుగా వచ్చి ఆక్రమించుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన లటోయిమాపై సదరు వ్యక్తి భార్యామణి కిందపడేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. ఇక భార్యను ఆపాల్సిన ఆ వ్యక్తి అందుకు విరుద్ధంగా మరింత రెచ్చిపొమ్మని భార్యను పురమాయించటం ఆ వీడియోలో దర్శనమిస్తుంది. ఈ వీడియో సమాచారంపై కేసు నమోదుచేసిన పోలీసులు ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ