‘జికా’ సెక్స్ ద్వారా కూడా?

February 03, 2016 | 12:20 PM | 1 Views
ప్రింట్ కామెంట్
zika-virus-through-sex-niharonline

జికా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి. ఇక ఇప్పుడు ఈ  వైరస్ గురించి మరో భయంకర నిజం బయటకు వచ్చింది. గర్భస్థ శిశువులపై పెను ప్రభావం చూపుతున్న ఈ వైరస్ కేవలం దోమతో మాత్రమే కాకుండా, స్త్రీ పురుషుల మధ్య జరిగే శృంగారం ద్వారా కూడా వ్యాపిస్తుందని డల్లాస్ కౌంటీ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ తేల్చింది. ఈ మేరకు టెక్సాస్ లో 'జికా' కేసు నమోదైందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగం స్పష్టం చేసింది.           

                                              వెనిజులాకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తితో ఉన్న లైంగిక సంబంధం కారణంగా ఈ వ్యాధి ఓ మహిళకు సోకిందని డల్లాస్ కౌంటీ ఆరోగ్య అధికారి ఒకరు వెల్లడించారు. టెక్సాస్ కౌంటీలో 'జికా' వైరస్ దోమలు లేవని, దీంతో వైరస్ ఎక్కడిదని పరిశోధిస్తే, ఈ భయంకర వాస్తవం తెలిసిందని చెప్పారు. కాగా, 'జికా'తో ఏర్పడుతున్న ప్రమాదం గంటగంటకూ పెరుగుతుండటంతో అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించిన సంగతి తెలిసింద.

మొన్న ఎయిడ్స్..నిన్న ఎబోలాలు ప్రపంచాన్ని వణికించి మాయమయ్యాయి. ఇప్పడు వీటి స్థానాన్ని భర్తీ చేయడానికి నేనున్నానంటూ వచ్చింది జికా వైరస్‌. దీని తీవ్రత ఎలా ఉండబోతుందోనని ప్రపంచ దేశాలన్నీ భయంతో వణుకుతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ