దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ ఏబీ డివిలీయర్స్ ప్రపంచ రికార్డు బద్దలు కోట్టాడు. వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ లో శివమెత్తిన డివిలీయర్స్ కేవలం 31 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరే అండర్సన్ పేరిట ఉంది. అండర్సన్ 36 బంతుల్లో సెంచరీ అప్పుడు కూడా ప్రత్యర్థి జట్టు విండీసే. తాజాగా, డివిలీయర్స్ అండర్సన్ కంటే 5 బంతులు తక్కువగా ఆడి సరికొత్త రికార్డు నెలకొల్పడం విశేషం. ఈ సఫారీ బ్యాటింగ్ దిగ్గజం ధాటికి విండీస్ బౌలర్స్ కకావికలం అయ్యారు. జోహెనెస్స్ బర్గ్ లోని న్యూ వాండరర్స్ స్టేడియం బౌండరీల వెల్లువలో తడిసి ముద్దయ్యింది. మొత్తం 44 బంతులు ఆడిన ఈ రైట్ హ్యండ్ బ్యాట్స్ మెన్ 9 ఫోర్లు, 16 సిక్సులతో 149 పరుగులు చేశాడు. ఇక మరో బ్యాట్స్ మెన్ ఆమ్లా 153. రూసో 128 సెంచరీలు సాధించడంతో 439/2 భారీ స్కొర్ సాధించింది. ఇది ప్రపంచం వన్డే క్రికెట్ చరిత్రలో రెండో హయ్యెస్ట్ స్కోర్. గతంలో శ్రీలంక 443/9 సాధించి మొదటి స్థానంలో ఉంది. అయితే ముగ్గురు సఫారీ బ్యాట్స్ మెన్ సెంచరీలు సాధించటం ఈ మ్యాచ్ ప్రత్యేకం.